తునిలో పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభం

1417చూసినవారు
తునిలో పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభం
కాకినాడ జిల్లా తుని మండలంలో ఆదివారం నాడు పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించారు. డిప్యూటీ ఎంపీడీవో రమణమూర్తి, టిడిపి నాయకుడు అప్పన రమేష్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 0 నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలకు 'నిండు జీవితానికి రెండు చుక్కలు' తప్పనిసరిగా వేయించాలని, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆదివారం రాలేని వారికి సోమ, మంగళవారాల్లో ఇంటింటికి వెళ్లి సిబ్బంది పోలియో చుక్కలు వేస్తారని తెలిపారు.

సంబంధిత పోస్ట్