తుని పట్టణంలోని సీతారాంపురంలో 2019లో జరిగిన హత్య కేసులో నిందితుడైన కర్రి మారెడ్డికి పిఠాపురంలోని 12వ అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి కోర్టు న్యాయమూర్తి ఎం. శ్రీహరి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. వడ్డీ వ్యాపారానికి సంబంధించి నల్లమిల్లి రాజారెడ్డి, కర్రి మారెడ్డి మధ్య జరిగిన ఘర్షణలో ఈ హత్య జరిగినట్లు సీఐ ఎం. గీతారామకృష్ణ తెలిపారు. రాజారెడ్డి ఇంట్లో నిద్రిస్తుండగా మారెడ్డి వెదురు కర్రతో దాడి చేయడంతో తీవ్ర రక్తస్రావంతో మృతి చెందాడు. అప్పటి సీఐ జి. రమేష్ బాబు దర్యాప్తు చేశారు. న్యాయమూర్తి వాదనలు విన్న తర్వాత ఈ తీర్పు వెలువడింది.