కాకినాడ జిల్లా తుని మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. 22వ వార్డు నుంచి పోటీ చేసిన
బీజేపీ అభ్యర్థి ఇళ్ల దర్గాదేవి కేవలం ఒక ఓటు మెజార్టీతో విజయం సాధించారు. కూటమి పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించిన ఏకైక వార్డులో గెలుపు సాధించడం విశేషం. అతి తక్కువ తేడాతో వచ్చిన ఈ ఫలితం స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది.