ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం

646చూసినవారు
ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యనమల దివ్య తుని మండలం లోవకొత్తూరులో లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేశారు. ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఆర్థిక ఇబ్బందులున్నా పేదల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె తెలిపారు. భవిష్యత్తులో 50 ఏళ్లకే పెన్షన్, హౌసింగ్ సైట్లు వంటి పథకాలు తీసుకువస్తామని చెప్పారు. ప్రజాదర్బార్ నిర్వహించి వికలాంగుడికి ట్రైసైకిల్ మంజూరు చేశారు, మరణించిన కార్యకర్త కుటుంబానికి రూ.5 లక్షల బీమా చెక్కు అందజేశారు.

సంబంధిత పోస్ట్