డైవర్స్ కాలనీలో దొంగల బీభత్సం భారీ చోరీ

1చూసినవారు
కాకినాడ జిల్లా తుని పట్టణంలోని డైవర్స్ కాలనీలో సోమవారం నాడు భారీ చోరీ జరిగింది. ఎం రమణ కుటుంబ సభ్యులు బయటకు వెళ్లిన సమయంలో గుర్తుతెలియని దుండగులు తాళాలు పగలగొట్టి ఇంట్లోకి చొరబడి, ఇంట్లో పెట్టిన 4 లక్షల నగదు, 30 తులాల బంగారం, వెండిని దోచుకెళ్లారు. బాధితుడు తుని టౌన్ ఎస్ఐ విజయ్ బాబుకు ఫిర్యాదు చేయగా, ఆయన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్