తుని మండలం తేటగుంట గ్రామంలో నాసా సంస్థ ఆధ్వర్యంలో రైతులకు సేంద్రీయ వ్యవసాయంలో నూతన పద్ధతులపై శిక్షణా కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఘన, ద్రవ జీవమృతాలు ఖర్చు లేకుండా తయారు చేసుకోవడం ద్వారా పెట్టుబడి తగ్గి, పంట దిగుబడి పెరిగి గిట్టుబాటు ధర లభిస్తుందని స్థానిక వ్యవసాయ అధికారి హిమబిందు వివరించారు. నాసా ప్రోగ్రాం మేనేజర్ తాటిపాక శ్రీను కొమ్మల కత్తిరింపు, పాలీలు తీసుకోవాలని సూచించగా, నాసా సిబ్బంది పద్మ అంతర పంటల ప్రాముఖ్యతను తెలిపారు. ఈ కార్యక్రమంలో పిట్ల లోవరాజు, వెంకటరమణ, సీతాలక్ష్మీ, దానియేలు వంటి స్థానిక రైతులు పాల్గొన్నారు.