జగన్నాథగిరిలోని ఏపీ రెసిడెన్షియల్ స్కూల్లో గురువారం ఎన్డీఆర్ఎఫ్ బృందం ఆధ్వర్యంలో విపత్తు నిర్వహణపై అవగాహన కార్యక్రమం జరిగింది. అత్యవసర పరిస్థితుల్లో పాటించాల్సిన జాగ్రత్తలు, సీపీఆర్, ఫస్ట్ ఎయిడ్, అగ్ని ప్రమాదాలు, వరదలు, భూకంపాలపై విద్యార్థులకు ప్రాక్టికల్ గా వివరించారు. ఎమ్మార్వో ప్రసాద్ ఆధ్వర్యంలో స్కూల్ ఆవరణలో మొక్కలు నాటారు.