తుని: ఫొటోలు మార్ఫింగ్ చేశాడని కేసు

133చూసినవారు
తుని: ఫొటోలు మార్ఫింగ్ చేశాడని కేసు
తుని పట్టణంలోని ఒక ప్రముఖ జ్యూవెలరీ దుకాణంలో పనిచేస్తున్న సీహెచ్ రమేష్ అనే యువకుడు తోటి సిబ్బంది ఫోటోలను మార్ఫింగ్ చేశాడని ఎస్ఐ జె. విజయబాబు తెలిపారు. అనకాపల్లి జిల్లా రాయవరం మండలం పిడుగోలు ప్రాంతానికి చెందిన ఒక మహిళ ఫోన్ నుంచి ఆమెకు తెలియకుండానే రమేష్ కొన్ని ఫోటోలను మార్ఫింగ్ చేసి పంపినట్లు ఫిర్యాదు అందింది. ఇదేవిధంగా మరికొందరు సిబ్బంది ఫోటోలను కూడా మార్ఫింగ్ చేసినట్లు వచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్