తుని: ప్లాస్టిక్ సంచులు వద్దు.. నార సంచులే ముద్దు

612చూసినవారు
తుని: ప్లాస్టిక్ సంచులు వద్దు.. నార సంచులే ముద్దు
తుని పట్టణంలోని శ్రీ తలుపులమ్మ అమ్మవారి దేవస్థానాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు అటవీ శాఖ ముఖ్య సలహాదారు కె. అంకారావు బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. "మన ఆలయం-మన బాధ్యత" నినాదంతో ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే నష్టాలను వివరించారు. భక్తులు, వ్యాపారులు ప్లాస్టిక్ కు బదులు నార, గడ్డి సంచులను వాడాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ చర్యలతో లోవ క్షేత్రం పర్యావరణ హితంగా మారనుంది.