తుని ఎంఆర్ పేట 29వ వార్డులో ఆదివారం సెల్ టవర్ నిర్మాణాన్ని వార్డు సభ్యులు, స్థానికులు అడ్డుకున్నారు. నివాస ప్రాంతాల మధ్య కొత్త టవర్ ఏర్పాటు వల్ల రేడియేషన్ పెరిగి అనారోగ్య సమస్యలు వస్తాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. రేడియేషన్ ప్రభావంతో పిల్లలు, గర్భిణీలు, వృద్ధులు ఇబ్బంది పడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. జనావాసాల్లో టవర్ ఏర్పాటును నిలిపివేయాలని అధికారులను కోరారు.