ప్రమాదకరంగా మారిన తుని అండర్ పాస్ బ్రిడ్జ్

5చూసినవారు
ప్రమాదకరంగా మారిన తుని అండర్ పాస్ బ్రిడ్జ్
కాకినాడ జిల్లా తుని పట్టణంలోని తాళ్లూరు రైల్వే గేట్ అండర్ పాస్ లో రాత్రి వేళల్లో ప్రయాణాలు ప్రమాదకరంగా మారాయి. విద్యుత్ దీపాలు వెలగకపోవడంతో చిమ్మ చీకట్లు అలుముకున్నాయి. దీంతో వాహనాల వెలుగులోనే రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ అండర్ పాస్ గుండా పలు గ్రామాల ప్రజలు, మహిళలు ప్రయాణిస్తున్నారు. మహిళల భద్రతకు పెనుముప్పు ఏర్పడిందని, అధికారులు వెంటనే చర్యలు తీసుకుని దీపాలు వెలిగేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్