తుని రూరల్ సీఐ చెన్నకేశవరావు విద్యార్థులకు అంబేడ్కర్ ఆశయాలైన 'బోధించు, సమీకరించు' నినాదంతో విద్యావంతులు కావాలని పిలుపునిచ్చారు. గురువారం జరిగిన కార్యక్రమంలో ఆయన యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి, చైతన్యవంతమైన సమాజం కోసం కృషి చేయాలని, అంబేడ్కర్ స్ఫూర్తితో ఉన్నత లక్ష్యాలను సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంబేడ్కర్ యూత్ సభ్యులు కాలా సందీప్, రవి తదితరులు పాల్గొన్నారు.