తొండంగి మండలం వలసపాకలి గ్రామంలోని పోస్టాఫీస్ సేవలపై గ్రామస్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఖాతాల లావాదేవీల్లో జాప్యం, నగదు ఉపసంహరణలో సమస్యలు, సిబ్బంది సరైన సమాచారం ఇవ్వకపోవడం వంటి ఇబ్బందులను వారు శుక్రవారం అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రజలకు అవసరమైన సేవలను సకాలంలో, స్పష్టమైన సమాచారంతో అందించాలని, సమస్యలను త్వరగా పరిష్కరించాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు.