తొండంగి మండలం వలసపాకలి గ్రామంలో రోడ్డు పరిస్థితులు అధ్వాన్నంగా మారడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాన రోడ్డుపై ఏర్పడిన గుంతలు, పూడులు, జారుడు ప్రాంతాల వల్ల వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇటీవల చిన్న ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని తెలిపారు. ఈ సమస్యపై గ్రామస్తులు అధికారులకు వినతిపత్రం అందజేశారు.