వలసపాకలిలో స్వచ్ఛంద శుభ్రత కార్యక్రమం

482చూసినవారు
వలసపాకలిలో స్వచ్ఛంద శుభ్రత కార్యక్రమం
తొండంగి మండలం వలసపాకలి గ్రామంలో గ్రామస్తులు స్వచ్ఛందంగా శుభ్రత కార్యక్రమం నిర్వహించారు. ఆలయ పరిసరాలు, రహదారుల వద్ద పేరుకుపోయిన చెత్తను తొలగించి పరిశుభ్ర వాతావరణాన్ని ఏర్పరిచారు. గ్రామ యువకులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ముందున్నారు. గ్రామాన్ని శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదేనని వారు తెలిపారు. స్థానికులు ఈ కార్యక్రమాన్ని అభినందించారు.

సంబంధిత పోస్ట్