కాకినాడ జిల్లా తుని పట్టణంలో ఆదివారం నాడు గాంధీ సత్రంలో అనుమానాస్పదంగా మహిళ మృతి చెందింది. ఎన్ఎస్ వెంకట నగరానికి చెందిన మహిళ సుమారు 50 సంవత్సరాలు పైబడి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్య, అత్యాచారం జరిగిందా అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.