తునిలో టీడీపీ క్యాడర్‌తో యనమల దివ్య సమావేశం

709చూసినవారు
తునిలో టీడీపీ క్యాడర్‌తో యనమల దివ్య సమావేశం
తుని గ్రామీణ మండలంలోని నందివంపు, మరువాడ, కొత్తవెలంపేట, సీతయ్యపేట గ్రామాల్లోని టీడీపీ క్యాడర్‌తో ప్రభుత్వ విప్ యనమల దివ్య శనివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం రెండేళ్లలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమీక్షించారు. గ్రామాలకు కేటాయించిన నిధుల వినియోగం, ప్రజా సమస్యల పరిష్కారంపై పార్టీ శ్రేణులతో చర్చించారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంతో పాటు గ్రామాభివృద్ధికి కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు.

సంబంధిత పోస్ట్