వైయస్సార్ వర్ధంతి: దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో నివాళులు

1చూసినవారు
తుని పట్టణంలో డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి వేడుకలు బుధవారం మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. స్థానిక రామా థియేటర్ వద్ద వైయస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఫీజ్ రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్, జలయజ్ఞం వంటి సంక్షేమ పథకాల ద్వారా వైయస్సార్ ప్రజల హృదయాల్లో నిలిచిపోయారని, పేదల అభ్యున్నతికి, వ్యవసాయ రంగానికి ఆయన చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు.

సంబంధిత పోస్ట్