మంత్రివర్గంలోకి కొణతాల రామకృష్ణ!

9చూసినవారు
మంత్రివర్గంలోకి కొణతాల రామకృష్ణ!
AP: రాష్ట్రంలో త్వరలో మంత్రివర్గ విస్తరణ జరగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో శుభ ముహూర్తాలు ఎక్కువగా ఉండటంతో సీఎం చంద్రబాబు విస్తరణ చేపడతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈసారి జనసేనకు, బీజేపీకి ప్రాధాన్యం పెరగవచ్చని సమాచారం. ప్రస్తుతం 24 మంది మంత్రులు ఉండగా, ఒక పదవి ఖాళీగా ఉంది. కొత్తవారిని చేర్చే అవకాశం ఉంది. సీనియర్లకు ప్రాధాన్యం ఇస్తారని, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణకు మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్