కొరియన్ కనకరాజుతో మెగా ఫ్యామిలీకి మరో హిట్?

7108చూసినవారు
కొరియన్ కనకరాజుతో మెగా ఫ్యామిలీకి మరో హిట్?
వరుణ్ తేజ్ నటించిన 'కొరియన్ కనకరాజు' సినిమా రేపు విడుదల కానుంది. ఈ మూవీ ప్రివ్యూ షోను కొందరు సినీ ప్రముఖులు చూసినట్లు వార్తలు వస్తున్నాయి. వారు చెబుతున్న దాని ప్రకారం.. రాయలసీమ వ్యక్తికి కొరియన్ దయ్యం పట్టడం, దాని నుంచి హీరో ఎలా తప్పించుకున్నాడనేది ఈ సినిమా కథాంశం. దర్శకుడు మేర్లపాక గాంధీ కామెడీ ట్రాక్ తో ప్రేక్షకులను అలరించడానికి ప్రయత్నించారు. అయితే ఈ ఏడాది ‘మన శంకర్ వరప్రసాద్’తో చిరంజీవి, 'పెద్ది' సినిమాతో రామ్ చరణ్ సక్సెస్ సాధించగా.. 'కొరియన్ కనకరాజు'తో వరుణ్ హిట్ కొడితే మెగా ఫ్యామిలీ ఖాతాలో మరో విజయం చేరినట్లేనని అభిమానులు భావిస్తున్నారు.

సంబంధిత పోస్ట్