AP: టీడీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై జనసేన మాజీ నేత కోట వినుత మరో వీడియో విడుదల చేశారు. ‘2019లో డిపాజిట్లు కూడా రాలేదని, 4 ఏళ్లల్లో శ్రీకాళహస్తిలో జనసేన పార్టీ బలంగా మారిందని నువ్వే చెప్పావ్ కదా సుధీర్ రెడ్డి. కోట వినుత పార్టీ అభివృద్ధికి చేసిన కృషి అని అన్నావుగా’ అని కోట వినుత అన్నారు. కాగా, కోట వినుత, ఆమె భర్త చంద్రబాబు ప్రైవేట్ వీడియోలు పంపాలని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చెప్పినట్లు వినుత డ్రైవర్ రాయుడు గతంలో ఓ వీడియోలో చెప్పిన విషయం తెలిసిందే.