బాపట్ల జిల్లా రేపల్లె-పెనుమూడి రోడ్డుపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో చల్లపల్లి మండలం లక్ష్మీపురం ఇందిరమ్మ కాలనీకి చెందిన కాకి రాజేశ్ (27) అనే యువకుడు మృతి చెందాడు. రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ఈ దుర్ఘటనలో రాజేశ్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మరణించాడు. అతనితో పాటు బైకుపై ఉన్న పరసాబత్తిన ప్రకాశ్ తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.