చల్లపల్లి మండలానికి చెందిన కొమ్ము పద్మ, తనకు చెందిన భూమి విక్రయానికి సంబంధించిన వివాదంలో న్యాయం చేయాలని అధికారులను సోమవారం కోరారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం, రోడ్డు పక్కన ఉన్న పది సెంట్ల స్థలాన్ని అత్యవసర కుటుంబ అవసరాల నేపథ్యంలో రూ. 58 లక్షలకు విక్రయించేందుకు అంగీకరించినట్లు తెలిపారు. అందులో భాగంగా రూ. 30 లక్షలు మాత్రమే అందాయని, మిగిలిన నగదు అందజేయాలని ఆమె కోరింది.