ఘంటసాల మండలం జిలగలగండి గ్రామంలో స్థలం వివాదం కత్తిపోటుకు దారితీసింది. పోరంబోకు స్థలంలో వరిగడ్డి వామి పెట్టుకున్న ఆవుల పాండురంగారావుపై సాంబశివరావు కత్తితో మెడపై, తలపై దాడి చేశాడు. ఈ ఘటన సోమవారం చోటుచేసుకుంది. గాయపడిన పాండురంగారావును వెంటనే ఆసుపత్రికి తరలించారు.