బాపులపాడు మండలం బండారు గూడెం గ్రామ సచివాలయంలో మహాత్మా గాంధీ 156 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా గాంధీ చిత్రపటానికి నివాళి అర్పించారు. పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు, సిపిఎం పార్టీ నాయకుడు బర్రె లెనిన్, కొండేటి నాగరాజు, రాజులపాటి నాగరాజు, అంగన్వాడీ కార్యకర్తలు, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.