
తుఫాన్ వాన: ధనియాల పేటలో రోడ్లపై నిలిచిన నీటి తొలగింపు
తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గుడివాడ మండలం ధనియాల పేటలోని పలు కాలనీల రోడ్లపై నీరు నిలిచిపోయింది. స్థానిక నాయకులు, కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ ఇజ్జాడ నాగరాజు గారి ఆధ్వర్యంలో డ్రైనేజీలలో పేరుకుపోయిన చెత్త, వ్యర్థాలను తొలగించి, నీరు సజావుగా ప్రవహించేలా చర్యలు చేపట్టారు.





































