గుడివాడ: ఎమ్మెల్యే పిఏ పేరుతో మోసం చేసిన నిందితుడి అరెస్ట్!

1890చూసినవారు
గుడివాడ: ఎమ్మెల్యే పిఏ పేరుతో మోసం చేసిన నిందితుడి అరెస్ట్!
గుడివాడ ఎమ్మెల్యే పీఏ పేరును దుర్వినియోగం చేస్తూ కేటరింగ్ వ్యాపారులను మోసం చేసి రూ. 1.73 లక్షలు కాజేసిన మాచినేని సంతోశ్ కుమార్ (28)ను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. అనంతపురం జిల్లా కృష్ణంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన సంతోశ్ కుమార్ పై సెక్షన్ 318(4)తో పాటు ఐటీ చట్టంలోని సెక్షన్ 66(సి) కింద కేసు నమోదు చేసినట్లు సీఐ సోమేశ్వరావు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్