గుడివాడ: చెస్ కేవలం ఆట కాదు జీవన పాఠం

2440చూసినవారు
గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ, చెస్ కేవలం ఆట మాత్రమే కాదని, అది జీవితానికి ఒక పాఠమని అన్నారు. ప్రతి పాఠశాలలో చెస్ క్లబ్ ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ఎన్టీఆర్ స్టేడియం స్పోర్ట్స్ క్యాలెండర్ లో భాగంగా ఆదివారం ఎన్టీఆర్ ఇండోర్ స్టేడియంలో 11వ ఎన్టీఆర్ మెమోరియల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి ఓపెన్ చెస్ పోటీలు జరిగాయి. ఈ పోటీలకు ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పోటీలను ప్రారంభించి, క్రీడాకారులతో కలిసి చెస్ ఆడుతూ వారిని ప్రోత్సహించారు.

సంబంధిత పోస్ట్