కృష్ణా: హైకోర్టులో కేసు పెండింగ్‌.. పెద్దలింగాలలో ఉద్రిక్తత

3చూసినవారు
కృష్ణా: హైకోర్టులో కేసు పెండింగ్‌.. పెద్దలింగాలలో ఉద్రిక్తత
కృష్ణా జిల్లా నందివాడ (M) పెద్దలింగాలలో చేపల చెరువు తవ్వకాల విషయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చెరువు వ్యవహారం హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నప్పటికీ, ఆదివారం సెలవు దినాన్ని ఆసరాగా చేసుకుని భారీ ప్రోక్లైన్లతో తవ్వకాలు చేపట్టేందుకు చెరువు యజమానులు సిద్ధమైనట్లు సమాచారం. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో గుడివాడ DSP శ్రీనివాస్ ఆధ్వర్యంలో సుమారు 100 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్