
పెనుగంచిప్రోలు: తిరుపతమ్మ హుండీ ఆదాయం రూ. 78 లక్షలు
పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ అమ్మవారి ఆలయంలో బుధవారం హుండీ లెక్కింపు జరిగింది. గత 71 రోజులకు గాను అమ్మవారికి నగదు రూపంలో రూ. 78,12,667 ఆదాయం వచ్చినట్లు ఈవో తెలిపారు. దీంతో పాటు 50 గ్రాముల బంగారం, 220 గ్రాముల వెండిని భక్తులు కానుకలుగా సమర్పించారు. అమెరికా, సౌదీ, మలేషియా, ఆస్ట్రేలియా దేశాలకు చెందిన విదేశీ కరెన్సీ కూడా హుండీలో లభించినట్లు అధికారులు వెల్లడించారు.





































