ఎన్టీఆర్ జిల్లా, జగ్గయ్యపేట మున్సిపాలిటీలో వారం రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్యాంకర్ల ద్వారా రోజుకు కేవలం 4-5 బిందెల నీరు మాత్రమే అందుతుండటంతో నీటి కోసం ప్రజలు అవస్థలు పడుతున్నారు. నాలుగు రోజులు గడుస్తున్నా ఈ తాగునీటి కష్టాలు తీరకపోవడంతో, అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.