జగ్గయ్యపేట మున్సిపల్ ఛైర్మన్ రాఘవేంద్ర, వీధి దీపాలకు ₹2 కోట్లు ఖర్చు పెట్టినట్లు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. సోమవారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో
వైసీపీ కౌన్సిలర్ మనోహర్, వీధి దీపాలకు అంత ఖర్చు చేసినా ఫలితం లేదని, ట్రాన్స్కోకు బిల్లులు కూడా కట్టలేదని ఆరోపించారు. మొత్తం మున్సిపల్ బడ్జెట్ ₹4 కోట్లు అయితే దీపాలకే అంత ఖర్చు ఎలా పెడతారని ఛైర్మన్ ప్రశ్నించారు.