పెనుగంచిప్రోలులో ఆదివారం రాత్రి
వైసీపీ నూతన కార్యాలయాన్ని
వైసీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాశ్ ప్రారంభించారు. స్థానిక పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి పార్టీ శ్రేణులతో కలిసి ర్యాలీగా బయలుదేరి, మక్కపేట రోడ్డులో నూతనంగా నిర్మించిన భవనంలో పార్టీ కార్యాలయానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా అవినాశ్ మాట్లాడుతూ, రాబోయే కాలంలో
వైసీపీ విజయకేతనం ఎగరవేస్తుందని, జగ్గయ్య పేట నియోజకవర్గంలో తన్నీరు ఎమ్మెల్యే కావడం ఖాయమని అన్నారు.