
మోంథా తుఫాన్: మచిలీపట్నంలో రోడ్లపై చెట్లు, ట్రాఫిక్కు అంతరాయం
మచిలీపట్నంలో మోంథా తుఫాన్ ప్రభావంతో లక్ష్మీపురం షుగర్ ఫ్యాక్టరీ సమీపంలో రోడ్డుపై ఎదురుగాలులకు చెట్లు విరిగిపడ్డాయి. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని మచిలీపట్నం మున్సిపాలిటీ సిబ్బంది వెంటనే స్పందించి, చెట్లను తొలగించే పనులు చేపట్టారు. ట్రాఫిక్కు ఎటువంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ పనులు కొనసాగుతున్నాయి.




































