మచిలీపట్నం: పంచాయతీలో జిల్లా డీపీఓ ధనలక్ష్మి ఆకస్మిక తనిఖీ

4003చూసినవారు
మచిలీపట్నం నార్త్ రూరల్ పరిధిలోని తాళ్లపాలెం పంచాయతీ జొన్నలవారి మోడీ గ్రామంలో సోమవారం జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) ధనలక్ష్మి అకస్మికంగా పర్యటించారు. గ్రామాలలో క్షేత్రస్థాయి పరిస్థితులను, ప్రజలకు అందుతున్న కనీస సౌకర్యాలను స్వయంగా పరిశీలించడమే లక్ష్యంగా ఆమె ఈ పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామంలోని వీధిలైట్లు, శానిటేషన్ పనులు ఏ విధంగా జరుగుతున్నాయో డీపీఓ స్వయంగా వీధివీధిన తిరుగుతూ పర్యవేక్షించారు.

సంబంధిత పోస్ట్