మచిలీపట్నం: అధికార దుర్వినియోగానికి పాల్పడలేదు

78చూసినవారు
మచిలీపట్నం: అధికార దుర్వినియోగానికి పాల్పడలేదు
తాను అధికార దుర్వినియోగానికి పాల్పడలేదని మచిలీపట్నం మేయర్ చిటికేనా నాగేశ్వరమ్మ పేర్కొన్నారు. శుక్రవారం మచిలీపట్నంలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. మా నాయకుడు పేర్ని వెంకట్రామయ్య సతీమణి పేర్ని జయసుధ మేయర్ వాహనంలో రావడంపై వివాదాస్పదంగా రాసిన కథనాన్ని ఖండించారు. మా నాయకుడు భార్య మాత్రమే కాదు ఆ వాహనంలో నేను కూడా ఉన్నానని మేయర్ బదులిచ్చారు. లేనిపోని ఆరోపణలు చేయవద్దన్నారు.

సంబంధిత పోస్ట్