పేదలకు పట్టణాల్లో 2 సెంట్లు, పల్లెల్లో 3 సెంట్లు ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు. గురువారం సీపీఐ నాయకులతో కలిసి మచిలీపట్నం 28వ డివిజన్ లో ఆయన పర్యటించారు. పేద వర్గాలకు భూమి ఇవ్వాలని కోరుతూ సచివాలయం అడ్మిన్ కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.