కృష్ణా జిల్లా మచిలీపట్నంలో గుర్తుతెలియని దుండగులు తాళం వేసి ఉన్న ఇంట్లోకి చొరబడి భారీ చోరీకి పాల్పడ్డారు. ఈ సంఘటన సోమవారం జరిగింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. బాధితుడు సర్కిల్ పేటకు చెందిన పాత ఇనుము కొట్టు వ్యాపారి అని సమాచారం. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.