
కీర్తిరాయినిగూడెంలో రోడ్డు ప్రమాదం వ్యక్తులకు తీవ్ర గాయాలు.
మైలవరం మండలం కీర్తిరాయినిగూడెంలో ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. మైలవరం నుండి నాగులూరు వెళుతున్న శ్రీకాంత్, పులిరాజు ద్విచక్ర వాహనం అదుపుతప్పి పడిపోయింది. డ్రైనేజీ మరమ్మతుల కోసం తీసిన మట్టిని రహదారిపై వదిలేయడమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు. గాయపడిన వారిని 108 ద్వారా మైలవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.




































