భూమి పట్టా పుస్తకాల పంపిణీ

2చూసినవారు
భూమి పట్టా పుస్తకాల పంపిణీ
మైలవరం నియోజకవర్గం జి. కొండూరు మండలం వెంకటాపురం గ్రామంలో భూమి పట్టా పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన లబ్ధిదారులకు భూమి పట్టా పుస్తకాలను అందజేశారు. కార్యక్రమంలో మండల అధికారులు, గ్రామ ప్రజలు, తెలుగుదేశం పార్టీ గ్రామ నాయకులు, కార్యకర్తలు, జి. కొండూరు మండలానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. పట్టా పుస్తకాలు అందుకున్న లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అధికారులు భూ సంబంధిత హక్కులు, పట్టా పుస్తకాల ప్రాముఖ్యతపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.

సంబంధిత పోస్ట్