ఎన్టీఆర్ జిల్లా, మైలవరంలో బుధవారం రాత్రి స్థానిక వీటీపీఎస్ జెన్ కో సెక్యూరిటీలో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న పచ్చిగోళ్ళ జోసెఫ్ రాజ్ విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యారు. ఆయన వాహనం డివైడర్ ను ఢీ కొట్టడంతో తలకు తీవ్ర గాయాలైంది. స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. బాధితుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.