అమెరికాలో రోడ్డు ప్రమాదం.. జిల్లాకు చెందిన యువతి మృతి

11చూసినవారు
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. జిల్లాకు చెందిన యువతి మృతి
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు గ్రామానికి చెందిన అట్లూరి ప్రసన్న ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి న్యూయార్క్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. స్నేహితులతో కలిసి కారులో గుడికి వెళ్తుండగా, సిగ్నల్ వద్ద ఆగి ఉన్న వారి వాహనాన్ని మరో వాహనం ఢీకొట్టడంతో ఈ ఘోరం జరిగింది. ఈ ప్రమాదంలో ప్రసన్నతో పాటు మరో విద్యార్థిని అక్కడికక్కడే మరణించగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.  ఆమె ఇటీవల పేస్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండగా జరిగిన ఈ విషాదంతో కుటుంబసభ్యులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు.

సంబంధిత పోస్ట్