సివిల్ సప్లై అమలై కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, రాష్ట్రవ్యాప్త సమ్మెలో భాగంగా మైలవరం MLS పాయింట్ వద్ద CITU ఆధ్వర్యంలో సోమవారం కార్మికులు నిరసన చేపట్టారు. CITU జిల్లా ఉపాధ్యక్షులు సుధాకర్ మాట్లాడుతూ, హమాలీ బిల్లులు ప్రతినెల 5వ తేదీలోపు చెల్లిస్తామని గత 10 నెలల క్రితం మంత్రి కార్యాలయం ఇచ్చిన ఆదేశాలు అమలు చేయలేదని, హమాలీల న్యాయమైన డిమాండ్లను సత్వరమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.