
బూడిద రవాణా లారీలను అడ్డుకున్న ప్రజలు
మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం నెక్స్ట్ ఇబ్రహీంపట్నం వద్ద బూడిద రవాణా చేస్తున్న రెఫెక్స్ కంపెనీ బూడిద లోడింగ్లను స్థానిక ప్రజలు అడ్డుకున్నారు. తడి బూడిదను రోడ్లపైకి వదులుతున్నారని, సరైన పట్టాలు కట్టకుండా నర్సరీలకు వాడే షేడ్ నెట్లను లారీలకు కట్టి రోడ్లపైకి వదులుతున్నారని, దీనివల్ల వాహన చోదకులు, గ్రామ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.





































