
జి కొండూరు: ఎలుకల నివారణ కార్యక్రమం
గురువారం జి. కొండూరు మండల స్థాయి రైతు సేవా కేంద్రాలలో సామూహిక ఎలుకల నివారణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు విషపు ఎర (960 గ్రా. బియ్యం, 20గ్రా. వేరుశెనగ నూనె, 20 గ్రా. బ్రోమోడియోలిన్) తయారీ, పంపిణీ విధానాన్ని వివరించారు. జిల్లా వ్యవసాయ అధికారి విజయకుమారి మాట్లాడుతూ, సామూహిక ఎలుకల నియంత్రణతో వరి దిగుబడిని పెంచవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, రైతులు పాల్గొన్నారు.






































