
శిధిలమైపోయిన వాటర్ ట్యాంక్ ని, నిర్మూలించండి
మైలవరం మండలం సబ్జపాడు గ్రామంలో, PWS స్కీమ్ కింద మంజూరైన వాటర్ ట్యాంక్ మరమ్మత్తు పనులను స్థానికులు వ్యతిరేకించారు. శిథిలావస్థకు చేరుకున్న ఈ ట్యాంకును తొలగించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ విషయాన్ని గ్రామ పంచాయతీ కార్యదర్శికి నోటీసు ద్వారా తెలియజేశారు. కొత్త ట్యాంకు నిర్మాణం కోసం ప్రజా దర్బార్ లో పెట్టిన అర్జీలపై మండల పంచాయతీ రాజ్ AE సంతకాలు తీసుకున్నారని తెలిపారు.






































