
ఐనపూరు హైస్కూల్లో మధ్యాహ్న భోజన పథకం పరిశీలన
కృష్ణా జిల్లా పామర్రు మండలం ఐనపూరు హైస్కూల్లో శ్రీమతి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును ఎస్ఎంసి కమిటీ చైర్మన్ దూడల శివనాగభవాని గురువారం పర్యవేక్షించారు. వంటకాలను పరిశీలించి, రుచి చూసి, ప్రభుత్వ మెనూను తప్పనిసరిగా పాటించాలని, పరిశుభ్రత పాటించాలని ఏజెన్సీ వారికి సూచించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసి, పథకం అమలుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు తమ్మన వేణుగోపాలరావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.







































