పామర్రు పట్టణంలో గ్రామ సింహాలు (కుక్కలు) విచ్చలవిడిగా తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. శనివారం రాత్రి పదుల సంఖ్యలో గ్రామ సింహాలు రహదారిపై వెళ్తున్న వారిపై దాడి చేయడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇప్పటికే పలువురిని గాయపరిచిన ఈ గ్రామ సింహాల బారి నుంచి తమను రక్షించాలని ప్రజలు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు.