గుడివాడ కోర్టు అదనపు జిల్లా జడ్జి సుబ్రహ్మణ్యం శనివారం పెదపారుపూడిలోని తహశీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయసేవ సంస్థ ప్రవేశపెట్టిన జాగృతి పథకం కింద పేదలకు అందుతున్న ఉచిత న్యాయ సహాయం, సలహాలపై ఆరా తీశారు. ప్రజలకు రెవెన్యూ సేవలు సకాలంలో అందుతున్నాయో లేదో రెవెన్యూ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.