మొవ్వ మండలం అవిరుపూడి గ్రామంలో
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL), మచిలీపట్నం ఆధ్వర్యంలో విజిలెన్స్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో BEL మచిలీపట్నం విజిలెన్స్ ఆఫీసర్ కె. శ్రీధర్ బాబు పాల్గొని అవినీతి నిర్మూలన, పారదర్శకత, నిజాయితీ ప్రాముఖ్యతపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. అవినీతికి తావులేకుండా ప్రతి ఒక్కరూ నిజాయితీగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, అవినీతి రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో BEL అధికారులు రామకృష్ణ, గోపాల్ కృష్ణ, హనుమాన్ తో పాటు పంచాయతీ సభ్యులు, గ్రామ పెద్దలు, అధికారులు మరియు ప్రజలు పాల్గొన్నారు.